మహాని వణికిస్తున్న కరోనా

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కొత్తగా 748 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 11,967కి చేరింది. ఇవాళ ఒక్కరోజే 25 మరణాలు సంభవించాయని, మొత్తం మరణాల సంఖ్య 462కి చేరిందని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది.

Also Read :  రూ.2 లక్షలతో నీటి సదుపాయం… ప్రభుత్వ పాఠశాలలకు అండగా ‘కైండ్ ఇండియా’

కాగ మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, భౌతికదూరం పాటించాలని, మాస్కులు విధిగా ధరించాలని సూచించారు.