మద్యం ప్రియులకు మహరాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు

దాదాపు 45 రోజుల తర్వాత మద్యం షాపులు ఓపెన్ కావడం తో మద్యం బాబులు పండగ చేసుకుంటున్నారు. ఇష్టపూర్తిగా మద్యం తాగుతూ కిక్ పెంచుకుంటున్నారు. అయితే మద్యం దుకాణాల వద్ద మద్యం ప్రియులు భౌతిక దూరాన్ని పాటించడం విస్మరిస్తున్నారు.

దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల వద్ద లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న క్రమంలో వైన్, బీరుతో సహా అన్ని స్వదేశీ, విదేశీ బ్రాండ్లను ఇంటికే సరఫరా చేసేందుకు నిర్ణయించింది. అయితే ఈ అవకాశాన్ని లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలకు మాత్రమే కల్పించింది. ఇప్పటికే మద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనలు రూపొందించింది. ఏదైనా మద్యం దుకాణం పరిధి వరకు మాత్రమే ఆ దుకాణం వారు హోం డెలివరీ చేసేందుకు అనుమతిని ఇచ్చింది