వణికిస్తున్న మహారాష్ట్ర

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1396 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 48మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం 27,892 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 872మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

కాగా దేశంలో అత్యధికంగా కొవిడ్‌-19 తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8068 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 342మంది మృత్యువాతపడ్డారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 440కేసులు నమోదయ్యాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ వైరస్‌ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. పుణె, నాగ్‌పూర్‌లో కూడా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.