మల్లెపూల పంచాయితీలో ఎంటరైనా శ్రీరెడ్డి

గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా వేదిక ఫై బీజేపీ యువ మహిళా నేతలు మాధవీలత వర్సెస్ సాధినేని యామిని మధ్య గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. సాధినేని యామినిపై మాధవీలత చేసిన ‘మల్లెపూల’ కామెంట్స్ ఆ పార్టీ వర్గాల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. మొన్నటివరకు తెలుగుదేశం పార్టీ లో ఉన్న యామిని..ఇప్పుడు బిజెపి పార్టీ లోకి చేరడం మాధవీలత జీర్ణించుకోలేక పోతుంది. ఈ నేపథ్యం లో ఆమెపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతుంది.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఈ ఇష్యూలో సాధినేని యామిని సైలెంట్‌గానే ఉన్నారు.. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన నేతలు కావడంతో ఎలాంటి కౌంటర్స్ ఇవ్వలేదు. అయితే సాధినేని యామినిపై సంచలన కామెంట్స్ చేసిన మాధవీలతకు కౌంటర్ ఇస్తూ రంగంలోకి దిగింది శ్రీరెడ్డి. మాధవీలత పేరు ప్రస్తావించకుండా.. సాధినేని యామిని జోలికి వస్తే తాట తీస్తా.. నీ బండారం బయటపెడతా అంటూ సంచలన పోస్ట్‌లను పెట్టి మల్లెపూల పంచాయితీకి ఇంకాస్త వేడిపుట్టించింది.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

నువ్వు థంజెండ్స్ సార్లు.. సారీ!! లక్ష టైమ్స్ మల్లెపూలు పిసికావో మరిచిపోయావా?? అవునులే మీ కులం వాళ్లకి లవ్ లెటర్స్, మిగతా వాళ్లని చూసి ఏడుపు అంటూ కులప్రస్తావన తీసుకుని వస్తూ మరో వివాదాస్పద పోస్ట్‌లు చేసింది శ్రీరెడ్డి. అసలు వీరిద్దరి మధ్య ఈమె ఎందుకు ఎంటరైయ్యిందో అర్థంకావడం లేదు.