
లోక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన మెట్రో సేవలు మళ్లీ మొదలు కాబోతున్నాయి. కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈ నెల 29 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్రంలో పలు సడలింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మే 11 నుంచి ఐటీ కంపెనీలు తెరుచుకున్నాయి.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నగరంలో కేసుల తీవ్రత దృ ష్ట్యా ప్రజారవాణా వ్యవస్థను ఈ నెలలో అందుబాటులోకి తీసుకురాకూడదని భావిస్తోంది. అయితే కేంద్రం మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం రాష్ట్రంలో మెట్రో రైళ్లకు అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది. ఈ నెల 17 తర్వాత హైదరాబాద్ నగరంలో కేంద్రం ఆదేశాలు ఇస్తే మెట్రో రైలు పట్టాలెక్కనుందని తెలుస్తోంది.









