
సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడనున్న విషయంలో తెలిసిందే. ఈ సమావేశంలో రెండు సెషన్లుగా జరగనున్నట్లు సమాచారం. తొలి సెషన్ మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు జరగనుంది. అరగంట విరామం తర్వాత.. సాయంత్రం ఆరు నుంచి రెండో సెషన్ ఉండొచ్చు.
పదిహేడో తేదీన లాక్ డౌన్ ముగుస్తుంది. చాలా రాష్ట్రాలు.. కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తున్నాయి. ఈ క్రమంలో పదిహేడో తేదీ తర్వాత ఏం చేయాలన్న దానిపై మోడీ.. ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే.. లాక్ డౌన్ పొడిగిస్తున్నప్పటికీ.. వరుసగా మినహాయింపులు ఇస్తూ వస్తున్నారు.









