మోడీ ఆన్ ఫాలో .. వైట్ హౌస్ క్లారిటీ

భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ఖాతాలను వైట్‌హౌజ్‌ అన్‌ఫాలో చేసింది. అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం ఖాతానూ అనుసరించడం మానేసింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భారతీయుల నుంచి పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో వైట్‌హౌజ్‌ స్పందించింది.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

విదేశీ పర్యటనలో సమయంలో అమెరికా అధ్యక్ష భవనం ఆయా దేశ అధినేతలు, వారి కార్యాలయాలను ట్విటర్‌లో తాత్కాలికంగా మాత్రమే అనుసరిస్తుందని స్పష్టం చేసింది. పర్యటన పూర్తయిన తర్వాత వీటిని అన్‌ఫాలో చేయడం సాధారణ ప్రక్రియ అని ఓ ప్రకటనలో తెలిపింది