
రీసెంట్ గా కేంద్రం వలస కూలీలను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు శ్రామిక్ ట్రైన్స్ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని ప్రత్యేక ట్రైన్స్ సైతం తీసుకొచ్చారు. ఈ రైళ్లలో ప్రయాణం చేస్తున్న వ్యక్తులు క్వారంటైన్ లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. క్వారంటైన్ కు వ్యతిరేకిస్తున్న సమయంలో రైల్వే సంస్థ ఇప్పుడు మరో కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఐ.ఆర్.సి.టి.సి ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఓ పాప్ అప్ వస్తుంది.
నేను వెళ్లే రాష్ట్రంలోని ఆరోగ్య సూచనల గురించి తెలుసుకున్నాను. వాటిని నేను పాటిస్తాను అనే పాప్ అప్ వస్తుంది. హిందీ, ఇంగ్లీష్ లో వచ్చిన పాప్ అప్ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టాలి. అలా పెట్టిన వాళ్లకు మాత్రమే మిగతా టికెట్ ప్రాసెస్ లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ కొత్త రూల్ ను ఐ.ఆర్.సి.టి.సి అందుబాటులోకి తీసుకొచ్చింది.









