ఉస్మానియా విద్యార్థులకు కరోనా కలకలం

ఉస్మానియా వైద్యకళాశాలలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శశికళ తెలిపారు. ఉస్మానియాలో 296 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు రోజుల క్రితం ఓయూ వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థికి పాజిటివ్ వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యార్థులంతా వసతిగృహంలోనే ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం 180 మంది విద్యార్థినిలు, 116 మంది విద్యార్థులకు పరీక్షలు చేయించింది. వీరిలో ఇప్పటి వరకు 12 మందికి పాజిటివ్‌గా తేలిందని, మిగిలిన వారి ఫలితాలు బుధవారం వచ్చే అవకాశముందని ప్రిన్సిపల్‌ వెల్లడించారు.