కరోనాతో ఎమ్మెల్యే మృతి


పాకిస్థాన్‌లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే షహీన్ రజా (65) కరోనా వైరస్ బారినపడి మరణించారు. పంజాబ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రజా లాహోర్‌లో కరోనాతో పోరాడుతూ మరణించినట్టు మాయో ఆసుపత్రి సీఈవో డాక్టర్ అసద్ అస్లాం తెలిపారు.

కరోనా బారిన పడిన రజాను ఈ నెల 17న ఆసుపత్రిలో చేర్చగా, సోమవారం మాయో ఆసుపత్రికి తరలించారు. అక్కడామెకు పరీక్షలు నిర్వహించగా కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిందని అస్లాం పేర్కొన్నారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కాగా, పాకిస్థాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ బుధవారం దేశాన్ని తెరిచారు. రెండు నెలల తర్వాత నేడు రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.