మందుబాబులపై పూలవర్షం..

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం తో పిచ్చోళ్ళు అయ్యారు. ఇక నిన్నటి నుండి అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభం మొదలు కావడం తో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఇక దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ప్రియులకు అనూహ్యరీతిలో స్వాగతం లభించింది. మద్యం కోసం క్యూలైన్లలో నిల్చున్న మందుబాబులపై ఓ వ్యక్తి పూలవర్షం కురిపించాడు. ఇవాళ ఉదయం ఢిల్లీ చందర్‌నగర్‌లోని ఓ మద్యం షాపు వద్ద కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరారు. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి… తన వెంట తెచ్చుకున్న పూలను తీసి మందుబాబులపై చల్లుతూ కనబడ్డాడు.. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారగా.. ఇక, ఆ వ్యక్తి మందబాబులపై ప్రశంసలు కురిపించారు.