
నోవల్ కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభ దశలో భారత దేశం కనీసం రోజుకు ఒక పీపీఈ కిట్‌ను అయినా తయారు చేసేది కాదు. భారత్ కూడా తొలుత పీపీఈలను దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత దేశీయ సంస్థలు చవకగా పీపీఈలు రూపొందిస్తుండడంతో వీటినే వినియోగిస్తున్నారు.
అయినప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరిన్ని పీపీఈలు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో భారత నేవీ సొంతంగా పీపీలు తయారుచేసింది. వీటికి కేంద్రం నుంచి ఆమోదం కూడా లభించింది. భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయడమే ఇక తరువాయి.
నేవీ తయారుచేసిన ఈ పీపీఈలకు కేంద్రం ఆధ్వర్యంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్ మాస్) సంస్థ అన్ని పరీక్షల అనంతరం అనుమతి పత్రం జారీ చేసింది.









