లాక్ డౌన్ ఎఫెక్ట్ : పోలీస్ స్టేషన్ లోనే పెళ్లి

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా బుసలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా ను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ప్రజలు ఇంట్లో నుండి బయటకు రాకూడదని..విందు వినోదాలకు పాల్పడకూడదని ప్రభుత్వాలు చెపుతుండడం తో వేల సంఖ్యలో పెళ్లి వేడుకలు రద్దయ్యాయి. కానీ ఓ జనతా మాత్రం పోలీసుస్టేషన్ లో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహుజీకి చెందిన అనిల్‌, ఘాజీపూర్‌కు చెందిన జ్యోతి ఏప్రిల్ 20న‌ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అనుకున్న స‌మ‌యానికి పెళ్లి జ‌రిగిపోవాల్సిందేన‌ని వారు నిశ్చ‌యించుకున్నారు. ఇక ఇంట్లో పెళ్లి చేసుకుందాం అంటే ఇరుకు గా ఉంటుంది. అంతే కాకుండా పోలీసులు వంద ఆంక్షలు పెట్టారు. దాంతో తన పెళ్ళిని ఆ యువకుడు పోలీస్ స్టేషన్ లోనే చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పోలీసులు కూడా అంగీకరించడంతో ముహూర్తానికి పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి ఇరు కుటుంబాల నుండి 5గురు చొప్పున అతిధులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లి తంతు గురించి అంత మాట్లాడుకుంటున్నారు.