
లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రవాణా రంగానికి సంబంధించి వచ్చిన బెయిల్ఔట్ ప్యాకేజీ గురించి ప్రస్తావనకు రాగా.. ఈ రంగంలో ఉన్న అన్ని సమస్యలూ తనకు తెలుసని గడ్కరీ అన్నారు.
రవాణా రంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం తెచ్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజా రవాణాకు లండన్ మోడల్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు.









