ఘోర రైలు ప్రమాదం.. 16 మంది మృతి

మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. ఈప్రమాదంలో 16 మంది మృతి చెందారు.

క్షతగాత్రులను ఔరంగబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో, ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు. పట్టాలపై నిద్రిస్తున్న వారిని రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

మహారాష్ట్రలోని జాల్‌నా నుంచి వలస కూలీలు మధ్యప్రదేశ్‌కు రైలు పట్టాలను అనుసరిస్తూ బయల్దేరారు. మార్గమధ్యంలో విశ్రాంతికోసం నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.