
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. కరోనా వైరస్ కారణంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దేశ వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా లాక్‌డౌన్ మూడోసారి మే 17వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తోంది. ఇప్పటికే వలస కూలీలను శ్రామిక్ రైళ్ల ద్వారా వారి గమ్య స్థానాలకు చేరుస్తోంది. తాజాగా మే 12వ తేదీ నుంచి దశల వారీగా పాసింజర్ రైళ్లను కూడా నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దిల్లీ నుంచి 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా దేశంలోని 15 ముఖ్య నగరాలకు నడపనున్నారు.









