రంజాన్ .. డ్రోన్లతో నిఘా

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. అయితే ప్రతి ఏడాదిలా ఇప్పుడు పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని అనేక దేశాల ప్రభుత్వాలు, ముస్లిం పెద్దలు సూచించారు.

అయితే, కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో… ముంబైలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలపై పోలీసులు డ్రోన్లతో నిఘా పెట్టారు. ఈ సందర్భంగా ముంబై పోలీస్ అధికార ప్రతినిధి ప్రణయ్ అశోక్ మాట్లాడుతూ, ఈరోజు నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయని… ఈ నేపథ్యంలో ముస్లింలు ఒక చోట గుమికూడకుండా, సామాజిక దూరం పాటించేలా చూస్తామని చెప్పారు. ముస్లింలకు ప్రత్యేకంగా ఎలాంటి మినహాయింపులు లేవని తెలిపారు. ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టామని చెప్పారు.