మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు ఆర్‌బీఐ అండ


ఇండియాలోని 6 డెట్ ఫండ్లను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న నిర్ణయానికి భారత రిజర్వ్ బ్యాంక్ కౌంటర్’ ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ల కోసం రూ. 50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీని ప్రకటించింది. కొవిడ్‌-19 ప్రభావంతో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమల ద్రవ్య లభ్యతకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆర్‌బీఐ తెలిపింది.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

పైగా మదుపర్ల నుంచి ఉపసంహరణకు డిమాండ్‌ పెరగడంతో పరిశ్రమ మరింత ఒత్తిడికి గురవుతోందని వెల్లడించింది. అయితే, ఈ ఒత్తిడి కేవలం హై రిస్క్‌ పథకాల్లో మాత్రమే ఉందని తెలిపింది. కొవిడ్‌-19 ప్రభావంతో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమల ద్రవ్య లభ్యతకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆర్‌బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంకు తాజా నిర్ణయంపట్ల మ్యూచువల్ ఫండ్ కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.