ఆశలు రేపుతున్న రికవరీ రేటు


భారత్‌లో కరోనా వైరస్‌ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు 8324 మంది కోలుకోగా.. రికవరీ రేటు 25.19శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. గడిచిన 24గంటల్లో 1718 కొత్త కేసులు నమోదైనట్టు పేర్కొన్న ఆయన.. దేశంలో కరోనా కేసులు రెట్టింపు కాలం 11 రోజులకు పెరిగిందన్నారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

14 రోజుల క్రితం ఈ రేటు 13.06శాతంగా ఉండేదని చెప్పారు. అలాగే, భారత్‌లో మరణాల రేటు 3.2శాతంగా ఉందని వివరించారు. 78శాతం కరోనా మరణాల్లో ఇతర వ్యాధులు కూడా ఉన్నాయని తెలిపారు.