శ్రీకాకుళంని కమ్మేసిన కరోనా


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని భావిస్తున్న తరుణంలో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో ఇవాళ 3 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఇక గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. కరోనాతో ఇవాళ ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 31కి చేరింది.