భారత్ లో టీ20 వరల్డ్ కప్ ??


కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా క్రీడా పోటీలు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టి20 వరల్డ్ కప్ పైనా కరోనా మేఘాలు ముసురుకున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడి కోసం అన్ని దేశాల కంటే కఠినంగా వ్యవహరిస్తున్న దేశం ఆస్ట్రేలియా. ఇక్కడ ఆర్నెల్ల పాటు కఠిన ఆంక్షలు విధించారు. సెప్టెంబరు 30 వరకు లాక్ డౌన్ ఉంటుంది.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

కాగ టీ20 వరల్డ్ కప్ నిర్వహణ పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సరికొత్త ప్రతిపాదన చేశారు. కరోనా కట్టడి కోసం ఆస్ట్రేలియా సుదీర్ఘంగా లాక్ డౌన్ ప్రకటించిందని, టోర్నీ ఆరంభం నాటికి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయన్నదానిపై స్పష్టతలేదని అన్నారు. ఆలోపే భారత్ లో కరోనా నియంత్రణ సాధ్యమైనట్టయితే, ఆసీస్ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 వరల్డ్ కప్ ను భారత్ లో నిర్వహించాలని సూచించారు.