సూర్యాపేటలో ఏం జరుగుతుంది ?

సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 26 కొత్త కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో వెల్లడించారు. దీంతో జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 80కి చేరింది.

కాగ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం ప్రత్యెక చర్యలకు దిగిన్దీ. కరోనా తీవ్రత దృష్ట్యా సూర్యాపేట మున్సిపాల్టీకి ప్రత్యేక అధికారిని నియమించింది. పురపాలకశాఖ ఉపసంచాలకులు వేణుగోపాల్‌ రెడ్డిని సూర్యాపేట మున్సిపాల్టీకి కరోనా ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఆ శాఖ కార్యదర్శి సుదర్శన్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.