తెలంగాణలో ఫుడ్‌ డెలివరీ బంద్


తెలంగాణ వ్యాప్తంగా మే 7 వరకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.రేపట్నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. అంతేకాకుండా ఎలాంటి పండగలైనా పరిమిత సంఖ్యలో ఇళ్లలోనే జరుపుకోవాలని చెప్పారు. రంజాన్‌ మాసం అయినప్పటికీ ఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదన్నారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

తెలంగాణలో ఏప్రిల్‌ 20 తర్వాత కూడా రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ప్రకటించినప్పటికీ, తెలంగాణలో పరిస్థితుల దృష్ట్యా మే 3 వరకు నిబంధనలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం ప్రభుత్వం చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.