తెలంగాణ కు షాక్ ఇచ్చిన కరోనా

తెలంగాణ రాష్ట్రం లో గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి అని అనుకున్నామో లేదో ఈరోజు ఏకంగా 50 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యి అందరికి షాక్ ను ఇచ్చింది. ఈ 50 కొత్త కేసులతో తెలంగాణ లో మొత్తం కరోనా కేసులు 700 కు చేరిపోయాయి. ఈ కొత్త కేసుల్లో వీటిలో 90 శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు వెల్లడించారు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

సూర్యాపేటలో గురువారం (ఏప్రిల్ 16) ఒక్క రోజే 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబంలో 14 మందికి కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 39కి చేరాయి. ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి కారణంగా కేసులు అధికమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 496 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో 18 మంది మరణించారు.