
తెలంగాణలో కరోనా వ్యాప్తి మరింత పెరుగుతోంది. కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 928కి చేరింది. ఇప్పటి వరకు 23 మంది మృతిచెందారు. ఈరోజు 8 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా.. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 194కి చేరింది.
ఇదీలావుంటే కేవలం ఒక్క సూర్యపేటలోనే జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 26 కొత్త కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో వెల్లడించారు. దీంతో జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 80కి చేరింది. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం ప్రత్యెక చర్యలకు దిగింది. కరోనా తీవ్రత దృష్ట్యా సూర్యాపేట మున్సిపాల్టీకి ప్రత్యేక అధికారిని నియమించింది.









