
తాజాగా వచ్చిన ఈ మూడు కేసులూ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు మరో 40 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 585కి పెరిగింది. రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి 29మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా ఈ రోజు ఈ సాయంత్రం 5గంటల వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 42,836 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో 11762 మంది కోలుకోగా.. 1389 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం తెలిపింది.
