తెలంగాణలో మూడు కేసులు మాత్రమే

తెలంగాణలో ఈ రోజు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1085కి చేరింది.

తాజాగా వచ్చిన ఈ మూడు కేసులూ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు మరో 40 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 585కి పెరిగింది. రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి 29మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కాగా ఈ రోజు ఈ సాయంత్రం 5గంటల వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 42,836 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో 11762 మంది కోలుకోగా.. 1389 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం తెలిపింది.