తిరుమల వెంకన్న దర్శనం అప్పుడే ..

దేశంలో కరోనా నియంత్రణ లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 03 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. దీంతో టీటీడీ తిరుమల వెంకన్న దర్శనం కావాలంటే భక్తులు కూడా మే 03 వరకు ఆగాల్సిందే అని తెలిపారు. వాస్తవానికి ఈ నెల 14 వరకు దర్శనాలు రద్దు చేశామని.. లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం.. ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ కొనసాగిస్తుండటంతో తాము కూడా దర్శనాలు వచ్చే నెల మూడు వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను టీటీడీ విడుదల చేసింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

భక్తుల్ని దర్శనానికి అనుమతించకపోయినా.. ఆగమ నియమాల ప్రకారం స్వామివారికి ప్రతి రోజూ నిర్వహించే అన్ని కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలియజేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ తిరుమల వెంకన్న దర్శనానికి భక్తుల్ని అనుమతించడం లేదు. అలాగే కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.