ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం


ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో 23 మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వలస కూలీలు రాజస్థాన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులు బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ్‌బంగాకు చెందిన వలసకూలీలుగా గుర్తించారు. ఎదురెదురాగా వచ్చిన రెండు ట్రక్కులు బలంగా ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.