ఏపీ వలస కార్మికుల టోల్ ఫ్రీ ఇదే

లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో , రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులు 1902కి ఫోన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read :  రూ.2 లక్షలతో నీటి సదుపాయం… ప్రభుత్వ పాఠశాలలకు అండగా ‘కైండ్ ఇండియా’

గ్రీన్‌జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌లకు మాత్రమే రాకపోకలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. రిలీఫ్‌ క్యాంప్‌లో నుంచి స్వగ్రామాలకు వెళ్లాలని అనుకునే వారికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో వెల్లడించింది.