
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ముంబయి పోలీస్ సంక్షేమానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ విరాళం అందజేశారు. ఒక్కొక్కరు రూ.5లక్షల చొప్పున ఇచ్చినట్టు ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ వెల్లడించారు. కరోనాపై యుద్ధంలో ముందుండి పనిచేస్తున్న పోలీసుల సంక్షేమానికి విరాళం ఇచ్చినందుకు ఈ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.
కాగ మహారాష్ట్రలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 1165 కేసులు, 48 మరణాలు సంభవించాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,228కి చేరింది.









