కరోనా వైరస్ అక్కడే పుట్టింది

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ పుట్టుకకు కారణం జంతువులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం కరోనా చైనాలో జంతువుల నుంచి సంక్రమించిందని వెల్లడించింది.

కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లో ఉన్న పీ4 లేబొరెటరీ నుంచి పుట్టుకొచ్చిందా లేదా అనే విషయాన్ని కనుగొనేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

కొవిడ్‌-19 వైరస్‌ లేబొరెటరీలో సృష్టించింది కాదని స్పష్టం చేసిన డబ్ల్యూహెచ్‌వో.. ‘‘తమ వద్ద ఉన్న పలు ఆధారాలు కరోనా వైరస్‌ జంతువుల మూలాలను కలిగి ఉందని సూచిస్తున్నాయని, దీన్ని లేబొరెటరీలోనో, మరే ఇతర ప్రదేశాల్లో తయారుచేయలేదని స్పష్టం చేసింది.