మందు ఎక్కువై పాముని కొరికి తిన్న వ్యక్తి..

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం తో పిచ్చోళ్ళు అయ్యారు. ఇక నిన్నటి నుండి అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభం మొదలు కావడం తో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. ఈ మద్యం మత్తులో వారు ఏంచేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు.తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా పామునే కొరికితిన్న ఘటన బయటకు వచ్చింది.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

కర్ణాటకలోని కోలారులో తన బైక్ కు అడ్డుగా వచ్చిన విష సర్పాన్ని చేత్తో పట్టుకొని దాన్ని కొరికి కొరికి చంపి తినేశాడు. మద్యం మత్తులో మందు బాబు చేసిన పనిని చూసి అక్కడి వారంతా షాక్ అయ్యాడు. పామును చూస్తేనే హడలిపోయే జనం, మద్యం తలకెక్కగానే ఆ మత్తులో అది పామో లేక చికెనో తెలుసుకోలేనంతగా మారిపోయాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి.