షాకింగ్ న్యూస్ : వైన్ షాప్స్ బంద్ ..కారణం అదే

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం తో పిచ్చోళ్ళు అయ్యారు. ఇక సోమవారం నుండి అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభం మొదలు కావడం తో మందు బాబులు పండగ చేసుకోవడం స్టార్ట్ చేసారో లేదో అప్పుడే పిడుగు లాంటి వార్త ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

నెలన్నర తరువాత ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు. సామాజిక దూరం పాటించాలని, క్యూలైన్లో ఉండాలని పోలీసులు ప్రభుత్వం చెప్తున్నా మందుబాబులు వినకుండా భారీ సంఖ్యలో ఎగబడటంతో అధికారులు సైతం చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ షాపులపై సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబైలో మద్యం షాపులను బుధవారం నుంచి మూసేస్తున్నట్టు ప్రకటించింది. ముంబై నగరంలో నిత్యవసర, మెడికల్ షాపులు మినహా అన్నింటిని బుధవారం నుంచి క్లోజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.