ఇక ఏడాదికి 15 రోజులు వర్క్ ఫ్రమ్ హోం..

కరోనా కట్టడి లో భాగంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేశాయి. ఇక భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగింపులు జరిగేలా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వర్కింగ్ రూల్స్ విషయంలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్దమైంది. ఇకపై ఏడాదికి 15 రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రణాళికలను సిబ్బంది మంత్రిత్వశాఖ రూపొందిస్తున్నట్లు సమాచారం.