పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేసి, 25 లక్షల చదరపు అడుగుల మేరకు ఐటీ పార్కులు, కార్యాలయాలకు అవసరమైన స్థలాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీనివల్ల ఉప్పల్ ప్రాంతంలో మరో 30,000 మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. ఔటర్ రింగ్‌రోడ్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు దూర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతే ఆ స్థలాలను ఐటీ కార్యాలయాలకు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.
హైదరాబాద్ నగరం నలుమూలలా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం త్వరలో గ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు.