
చిరంజీవి – కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. పలు కారణాలతో రిలీజ్ బ్రేక్ పడుతూ వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 29 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో ఏప్రిల్ 10 న శ్రీరామనవమి కానుకగా ఆచార్య నుండి కీలకమైన సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారట చిత్ర యూనిట్. ఈ పాట చిరంజీవి, చరణ్‌లపై తెరకెక్కిన పాట అని, అభిమానులు కనులవిందుగా ఉంటుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. సినిమాకు మేజర్ హైలైట్ ఈ పాటే అని చెబుతున్నారు. ఆ పాటను చూడాలంటే శ్రీరామనవమి వరకూ ఆగాల్సిందే.
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో చిత్రం తెరకెక్కింది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో సందేశాత్మక కథాంశంతో చిత్రం తెరకెక్కింది.









