ఓటీటీలో పునీత్ రాజ్‌కుమార్ లాస్ట్ మూవీ..


కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29, 2021న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పునీత్ హఠాన్మరణం కేవలం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, యావత్తు భారతీయ సినీ ప్రపంచమే ఉలిక్కిపడేలా చేసింది. కాగా ఒక సంవత్సరం తర్వాత పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘గంధడ గుడి’ విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం మార్చి 17, 2023న తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించబడుతుందని అధికారికంగా ప్రకటించింది.