
శంకర్ – రామ్ చరణ్ కలయికలో పొలిటికల్ డ్రామా దిల్ రాజు బ్యానర్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసిన యూనిట్..రీసెంట్ గా ఫైట్ కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసిన ఓ పాట కోసం రూ. 9.4 కోట్లు ఖర్చు చేయగా… అలాగే వేరేచోట ఓ ఫైట్ సీన్ కోసం రూ.10 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది.
మొత్తానికి శంకర్ ఈ సినిమాని చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ స్టార్ జయరామ్, శ్రీకాంత్, సునీల్, అరవింద్ స్వామి సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం శంకర్ .. ఓ యూనిక్ పాయింట్ ను టచ్ చేయబోతున్నారట.









