
సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తీ అయ్యిందని , చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం.
ఇక ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదల కాగా అవి మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం మూడో సాంగ్ మరియు సినిమా ప్రమోషన్స్ ని సంబంధించి ప్లానింగ్స్ లో ఉన్నారట. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మే 12 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.









