Gaami : గామి ఫస్ట్ డే కలెక్షన్స్.. విశ్వక్ కెరీర్లోనే హైయెస్ట్ !


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో వచ్చిన అడ్వెంచరస్ మూవీ ‘గామి’. మహాశివరాత్రి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్ తో పాటు విమర్శకులను సైతం ఆకట్టుకుంటూ మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది.

Kubera : ‘కుబేర’ గా వస్తున్న ధనుష్.. కానీ ?

దర్శకుడు విద్యాధర్ కాగిత టేకింగ్ అసాధారణంగా ఉంది. మేకర్స్ పరిమిత బడ్జెట్ ఖర్చు చేసినప్పటికీ, విజువల్స్ అగ్రశ్రేణిలో ఉన్నాయి. ఇక విశ్వక్ సేన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. నిజానికి ఈ సినిమా పెద్ద స్క్రీన్‌లపై సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు మంచి వసూళ్లనే రాబట్టింది. తొలి రోజు 9.07 కోట్ల గ్రాస్‌ సాధించినట్టు టీమ్‌ ప్రకటించింది. విశ్వక్ సేన్‌ కెరీర్లోనే ఇది హైయెస్ట్. చిన్న బడ్జెట్ సినిమాకి ఇది భారీ ఓపెనింగ్ అనే చెప్పొచ్చు.