Gaami : విశ్వక్ సేన్ ‘గామి’ పై రాజమౌళి స్పెషల్ పోస్ట్..


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’ మార్చి 8 న మహా శివరాత్రి నాడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ ఈ సినిమాపై కావాల్సినంత హైప్ క్రియేట్ చేసాయి. నిజానికి టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించగా.. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించారు. వి సెల్యులాయిడ్ సమర్పిస్తున్నారు.

RC16 : రామ్ చరణ్ కి జోడిగా ‘దేవర’ బ్యూటీ !

ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ పై పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ‘గామి’ సినిమాపై ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. “కఠోరమైన కృషి వుంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ సినిమా గురించి నిర్మాత కార్తీక్, దర్శకుడు విద్యాధర్ ఎంత కష్టపడ్డారో నన్ను కలిసి నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు అర్థమైంది” అంటూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.