Site icon TeluguMirchi.com

జీహెచ్‌ఎంసీలో ఓటింగ్‌ శాతం పడిపోవడానికి కారణాలు

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికీ పట్టం కట్టారా అని ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ సాగింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ శాతం మాత్రం దారుణం పడిపోయింది.

నగర వాసులు ఓటు వేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. వరుస సెలవులు ఉండటంతో సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరో​ వైపు కరోనా భయంతో ఓటు వేసేందుకు జనం బయటకు రాలేదు. చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో ఐటీ ఉద్యోగులు సొంతూళ్ల నుంచే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రాజకీయ నేతల దూషణల పర్వం కూడా ఓటింగ్ తగ్గడానికి కారణమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version