Site icon TeluguMirchi.com

రాజ్యసభకు నటుడు ప్రకాష్ రాజ్ ?

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ను కేసీఆర్ రాజ్యసభకు పంపించనున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరో మూడు నెలల్లో తెలంగాణ నుండి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దాంతో ఆ మూడు స్థానాల్లో ఒకదాన్ని ప్రకాష్ రాజ్ తో భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రకాష్ రాజ్ ను రాజ్యసభకు పంపించడం వల్ల తెరాస కి మంచి జరుగుతుందని భావిస్తున్నారట కేసీఆర్.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రాజ్ కు దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తరాదిన కూడా నటుడిగా మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు మంచి వాక్పటిమ కలిగిన నాయకుడు కూడా. ఇటీవల కేసీఆర్ ముంబై పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రకాష్ రాజ్, కేసీఆర్ బృందానికి స్వాగతం పలికారు. దాంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది ఈ వ్యవహారం.

Exit mobile version