Site icon TeluguMirchi.com

భారత్‌ అమ్ములపొదిలోకి మరొక బ్రహ్మస్త్రం

భారత్‌ మరో సరికొత్త క్షిపణిని పరీక్షించింది. సర్ఫేస్ టూ సర్ఫేస్ ప్రయోగించే ‘ప్రళయ్‌’ క్షిపణిని రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ఐలాండ్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి 150 కిమీ- 500 కిమీ మధ్య లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. మొబైల్‌ లాంఛర్‌పై క్షిపణి గమన నిర్దేశిత వ్యవస్థ సాయంతో ప్రయోగించే అవకాశం ఉన్నట్లు డీఆర్‌డీవో పేర్కొంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఆర్‌డీవో, శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు.

Exit mobile version