Site icon TeluguMirchi.com

కామెంట్: హీరోయిన్స్ తో కేటీఆర్ క్యాట్ వాక్

ktr

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు టీ టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి. మొన్న కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల లో ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్న ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి , సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ వినిపించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనని ప్రస్తావిస్తూ.. సొంత నియోజకవర్గ ప్రజల మనోభావాలను పట్టించుకోని కేటీఆర్… హైదరాబాదులో జరుగుతున్న ఫ్యాషన్ షోల్లో క్యాట్ వాక్ లతో బిజీబిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు రేవంత్. సొంత నియోజకవర్గ ప్రజల డిమాండ్లను పెడచెవిన పెడుతున్న కేటీఆర్… హీరోయిన్ సమంతా లాంటి హీరోయిన్స్ క్యాట్ వాక్ లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.

మరి రేవంత్ చేసిన ఈ విమర్శకు టీఆర్ఎస్ ఎలాంటి బదులు ఇస్తుందో చూడాలి.

Exit mobile version