ఎయిడ్స్ తో కరోనా కి లింక్ వుందా ?

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమే సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఆయాదేశాలు వ్యవహరించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిందేనని ఆస్ట్రేలియా డిమాండ్‌ చేసింది. వుహాన్‌ నగరంలో తొలుత బయటపడ్డట్లు భావిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సమయంలో చైనాపై వస్తోన్న ఆరోపణలను సమర్థిస్తున్నట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్‌ పేన్‌ స్పష్టంచేశారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

ఇదీలావుంటే ఫ్రెంచ్ వైరాలజీ నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత ల్యూక్ మోంటాగ్నీర్ తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. కరోనా వైరస్ మనిషి చేతిలో రూపుదిద్దుకున్న వైరస్ అని, ఎయిడ్స్ కు వ్యాక్సిన్ తయారుచేసే ప్రయత్నంలోనే ఈ మహమ్మారి ఉద్భవించిందని తెలిపారు. ఈ వైరస్ కు కేంద్రం వుహాన్ అనడంలో సందేహం అక్కర్లేదని, ఓ చైనా లాబోరేటరీనే దీనికి జన్మస్థానం అని స్పష్టం చేశారు.