సీఎం ఇంట్లో విషాదం

ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూశారు ఆయన వయసు 89 సంవత్సరాలు. కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యంతో న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మార్చి 13న ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్పించారు. డాక్టర్లు తీవ్రంగా యత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్.. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని యమకేశ్వర్‌లోని పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు. 1991లో ఉత్తరాఖండ్‌లో ఫారెస్ట్ రేంజర్‌గా ఉద్యగం నుంచి పదవీ విరమణ చేశారు. అప్పటి నుండి ఆయన స్వగ్రామంలోనే నివసిస్తున్నారు. ఆనంద్ సింగ్ బిస్త్ కు నలుగురు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఆనంద్ బిస్త్ కు రెండవ కుమారుడు.