45 రోజుల పసి కందును బలి తీసుకున్న కరోనా ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి దెబ్బకు పలువురి ప్రాణాలు పోగా తాజాగా 45 రోజుల పసికందు సైతం కరొనకు బలయ్యాడు. ఈ బాలుడి మృతితో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 21కి పెరిగింది.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

కరోనా బారినపడిన నారాయణపేట జిల్లాకు చెందిన బాలుడు ఆదివారం (ఏప్రిల్ 19) మృత్యువాతపడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. బాలుడి రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నట్లు అతడికి చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. దీంతో అతడు న్యుమోనియా బారిన పడి మరణించినట్లు వెల్లడించారు.