కేసీఆర్ ను మీడియా ముందు విస్కీ తాగమన్న వర్మ…

సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో..ఏ టైప్ పోస్ట్ లు పెడతారో ఎవరికీ తెలియదు..పది నిమిషాల్లోనే పది రకాలుగా ఆయన మనసు మారుతుంది. అందుకే వర్మ ను అంత ఓ రకంగా పిలుస్తుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లన్ని బంద్ కావడం తో సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా లో యాక్టివ్ అయ్యారు. ఇక వర్మ అయితే ఎప్పటి మాదిరిగా కంటే ఇంకాస్త ఎక్కువ గా ఉంటూ రకరకాల పోస్టులు పెడుతూ వస్తున్నాడు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

తాజాగా ఓ న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ..ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ని విస్కీ తాగాలని చెప్పి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఛాలెంజ్ ల ట్రెండ్ నడుస్తుంది కాదా మీరు కూడా ఓ ఛాలెంజ్ విసరమని సదరు యాంకర్ వర్మ ను కోరారు. దీంతో ఈ లాక్ డౌన్ పిరియడ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రెస్ మీట్‌‌లో అందరి ముందు కూర్చుని ఒక గ్లాస్ విస్కీ తాగమని నా ఛాలెంజ్.. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది ఆల్కహాల్ లేకుండా చచ్చిపోతున్నారు. వాళ్లందరూ ఈయన పెగ్ వేస్తుంటే కుళ్లుకుని చచ్చిపోయేలా కేసీఆర్ వీస్కీ తాగాలని ఛాలెంజ్ చేశారు వర్మ. ప్రస్తుతం వర్మ చేసిన ఛాలెంజ్ ఫై అంత విమర్శిస్తున్నారు.